ముసునూరు మండలం కాట్రేనిపాడు ఫారెస్ట్ ఏరియాలో అక్రమంగా బోరు వేస్తున్న సమాచారంతో వాహనాలను సీజ్ చేయడం జరిగిందని ఫారెస్ట్ రేంజర్ టి సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మాట్లాడుతూ గతంలో ఇదే మాదిరిగా అక్రమంగా గ్రావెల్ తరలించడం, పైపులైన్ వెయ్యడం, బోరు వేసే సందర్భాలలో 80 వాహనాలను సీజ్ చేసి,40 లక్షల రూపాయలు జరిమానా విధించామన్నారు. అటవీ ప్రాంతంలో అక్రమాలు చేస్తే సహించేది లేదన్నారు.