హైదరాబాద్ కు చెందిన 11 ఏళ్ల బాలుడు మూడేళ్ల క్రితం ఇంటి నుండి పారిపోయి గుంటూరు రైల్వే స్టేషన్ లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు దొరికాడు . వారు బాలుడిని ఏలూరు శనివారపు పేట బాలుర వసతిగృహం అధికారులకు అప్పగించారు. అప్పటినుండి శనివారపు పేట హోమ్ లో అతను ఉంటున్నాడు. ఆపరేషన్ ట్రేస్ లో భాగంగా బాలుడు ఇబ్రహీం ను అతని తల్లిదండ్రులైన అక్రమ్ ,ఆశ బేగం లు అడిషనల్ ఎస్పి అడ్మిన్ సూర్యచంద్రరావు, డీఎస్పీ శ్రావణ్ కుమార్ సిఐ సుబ్బారావు ల ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 6:30 నిమిషాల సమయం లో అప్పగించారు. బాలుడు తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు