పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం గొరగనమూడి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ నూకరాజు ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై వి ఏ ఏ, వి హెచ్ ఏ లకు డివిజన్ స్థాయి మూడు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. ప్రకృతి వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశం అయిన వివరించారు. నవధాన్యాల గురించి, బయో కల్చర్, కషాయాలు తదితర వాటిపై వివరించారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ కోఆర్డినేటర్ అరుణ కుమారి, ఏడిఏ శ్రీనివాసరావు, ఏవోలు బీన్సి బాబు, సంధ్యా, డివిజన్ ఇన్చార్జిలు అశోక్, సుబ్బారావు, మండల ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు, ఐ సి ఆర్ పిలు పాల్గొన్నారు.