అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని జామిమ మసీదు ఎదురుగా ఆసార్ మఖాన్ వద్ద సోమవారం సాయంత్రం మహమ్మద్ ప్రవక్త 1500 వ జన్మదినం ను పురస్కరించుకొని ప్రత్యేక మిలాద్ పఠనం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. సయ్యద్ ఆజ్మతుల్లా హుసేని, సయ్యద్ తఖీబాబా సయ్యద్ తాసిర్ బాబా ఆధ్వర్యంలో మిలాద్ పఠనం సాగింది. మహమ్మద్ ప్రవక్త సూక్తులతో పాటు నాత్ క్వానిల్లో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈనెల ఐదున మహమ్మద్ ప్రవక్త జన్మదిన పురస్కరించుకుని మిలాద్ నబీ జెండా ఊరేగింపు జరుగుతుందని ముస్లిం మత పెద్దలు పేర్కొన్నారు.