పటన్ చెరులో అతి త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం ఆస్పత్రి అధికారులతో కలిసి నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ.. ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన నియోజకవర్గ పరిధిలోని వివిధ పరిశ్రమంలో పనిచేస్తున్న కార్మికులకు ఆధునిక వసతులతో ఆస్పత్రి నిర్మించామన్నారు.