Araku Valley, Alluri Sitharama Raju | Aug 27, 2025
పెదబయలు మండలం బొండపల్లి పంచాయతీ చెంపపుట్టు గ్రామానికి చెందిన కామేశ్వరరావు పాంగిరాజు అనే యువకులపై దాడి చేసిన పెదబయలు ఎస్సైని కఠినంగా శిక్షించాలని పెదబయలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొండయ్య ఒక వీడియో ప్రకటనలో డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి జోలపుట్టు వెళ్లి వస్తుండగా బంగారు మెట్ట- కుజబంగి జంక్షన్ మధ్యలో చంపపుట్టుకు చెందిన ఇద్దరు యువకులు కారు ఆపి భోజనం చేస్తుండగా పెదబయలు ఎస్సై వచ్చి అకారణంగా చితక్కొట్టారని ఆరోపించారు. యువకులను కనీసం విచారించకుండా దాడి చేశారని, ఈ ఘటనలో ఎస్ఐ పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.