రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు వివరాలు శుక్రవారం ఇలా ఉన్నాయి. డ్యాం కెపాసిటీ 2 టీఎంసీలు కాగా పూర్తిగా నిండింది. 630 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తుంది. 120 క్యూసెక్కులు కుడి కాలువ నుంచి, 10 క్యూసెక్కుల నీరు ఎడమ కాలువ నుంచి పంట పొలాలకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 630 క్యూసెక్కుల నీరు మత్తడి దూకి బయటకు వెళుతుందన్నారు. జలపాతాన్ని తలపిస్తుంది ఎగువ మానేరు ప్రాజెక్ట్.