పలమనేరు: పట్టణంలో మంగళవారం మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు వైఎస్ఆర్సిపి ముఖ్య నేతలు కార్యకర్తలు భారీ ఎత్తున, రైతులకు మద్దతుగా యూరియా కొరత తీర్చాలంటూ స్థానిక సిల్క్ ఫామ్ వద్దనుండి ఆర్డిఓ కార్యాలయం వరకు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో భవానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్, జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి తదితర వైఎస్ఆర్సిపి ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.