ఎమ్మిగనూరు : ఉపాధి కోసం వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు మృతి..ఎమ్మిగనూరు మండలంలోని రాళ్లదొడ్డి గ్రామానికి చెందిన మాదిగ ఇషాక్ (20) ఉపాధి కోసం తెలంగాణ ఖమ్మం జిల్లాకు వెళ్లాడు. అక్కడ ఫ్లెక్సీ కట్టే పనిలో ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడి, కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏకైక కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు ఉరుకుందు సుజాత దంపతులు విషాదంలో మునిగిపోయారు. గ్రామమంతా శోకసంద్రంలో మునిగింది.