ముమ్మిడివరం మండల పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలైన గురజాపులంక, కూనాలంక, లంకాఫ్ ఠాణేలంక గ్రామాల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పర్యటించారు. గురజాపులంక గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ముంపుకు గురైన నేపథ్యంలో ఎమ్మెల్యే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ కూటమి నాయకులతో గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. వరద తగ్గుముఖం పట్టిందని, భయాందోళనలు చెందవద్దని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వరద బాధితులకు హామీ ఇచ్చారు.