ములుగు జిల్లా బుట్టాయగూడెం గ్రామానికి చెందిన దళిత వ్యక్తి నాగయ్య మృతికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన నాగయ్య మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు మాజీ ఎమ్మెల్యే పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు