శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం వీరాపురం పంచాయతీ హుస్సేన్ పురంలో చిలమత్తూరు ఎంపీపీ వైయస్సార్సీపి జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తమ రెడ్డిపై గుర్తుతెలియని దుండగులు దారి కాచి దాడికి పాల్పడ్డారు గాయపడిన పురుషోత్తం రెడ్డిని హిందూపురం ప్రభుత్వాసుపత్రి కి తరలించారు. ఎంపీపీ పురుషోత్తం రెడ్డి స్వగ్రామమైన హుస్సేన్ పురంలో గ్రామ సమీపంలోని దేవాలయం నుండి ఇంటికి తిరిగి వెళుతుండగా పురుషోత్తం రెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించారు.పురుషోత్తం రెడ్డి గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు చేరుకున్నారు దీన్ని గమనించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.