ఉపాధి హామీ ఉద్యోగుల పెండింగ్ జీతాలను ప్రభుత్వం వెంటనే చెల్లించేలా చూడాలంటూ మెదక్ జిల్లా అల్లాదుర్గం ఎంపీడీవో చంద్రశేఖర్ కు బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈజీఎస్ ఉద్యోగులు వినతి పత్రాన్ని అందజేశారు. గత మూడు నెలలుగా ప్రభుత్వం తమకు జీతాలు చెల్లించడం లేదని కుటుంబ పోషణ భారంగా మారుతుంది అంటూ వాపోయారు. తమకు చెల్లించాల్సిన పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించి తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీడీవో చంద్రశేఖర్కు ఇచ్చిన వినతి పత్రంలో ఉపాధిహామీ ఉద్యోగులు పేర్కొన్నారు.