రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత వేదిస్తోందని తక్షణమే కనీసం ముగ్గురు వైద్యులను నియమించాలని జిల్లా కలెక్టర్ ను రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవశ్రీనివాసులు కోరారు. బుధవారం మద్యాహ్నం ఆయన కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కు ఫోన్ చేసి రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ పేషంట్, ఇన్ పేషెంట్ వివరాలు తెలుపుతూ వైద్యులను నియమించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ఓపి పెరిగిందని, ఉన్న కొద్దిమంది డాక్టర్లపై పని భారం పెరిగిందనికూడా ఫోన్ లో వివరించారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కాలవకు హామీ ఇచ్చారు.