యువకుడి దారుణ హత్య సంఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక సిఐ రవీందర్ రెడ్డి మీడియాకు వివరాలు తెలిపారు. ఒంగోలు ప్రాంతానికి చెందిన జయప్రకాష్ (22) మేస్త్రి గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం బొల్లారం మున్సిపల్ పరిధిలోని కెబిఆర్ కాలనీలో నివసిస్తున్నారు. యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి శవాన్ని అతని ఇంటి ముందు పడేశారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.