కర్ణాటక రాష్ట్రం చిక్కబల్లాపూర్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆంధ్ర సరిహద్దులోని శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లోని చిలమత్తూరు మండలం కొడికొండ వద్ద చిత్రావతి, కుశావతి నదులు ప్రవహిస్తున్నాయిచిత్రావతి,కుషావతి నదులు నుండి వరద నీరు ఏపీలోని గోరంట్ల, పుట్టపర్తి దిగువ ప్రాంతాలకు వరద నీరు చేరుతాయి. కర్ణాటకలో వర్షపాతం మరింత పెరిగితే వరద నీరు ఉదృతి పెరిగే అవకాశం ఉంది.విద్యార్థులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నదులు దాటుకొని వెళ్లే పల్లె ప్రాంతాల విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యాశాఖ అధికారులు సమాచారం ఇవ్వాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.