మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధిలో మాజీ ఎమ్మెల్సీ స్వర్గీయ జగదీశ్వర్ రెడ్డి కీలకపాత్ర అని నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు మల్లు రవి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేపు ఉదయం 11 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ వద్ద జగదీశ్వర్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుందన్నారు.