మహబూబ్నగర్ రూరల్ మండలం ధర్మాపుర్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహ నిర్మాణం కొరకు రజక సంఘం నేతలు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రజక సంఘం జిల్లా నేత శివన్న మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ ఆశయాలను నెరవేర్చాలని వారు కోరారు. పండుగ సాయన్న సామాజిక సేవ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రజకులకు రిజర్వేషన్లు, హక్కులు, సంక్షేమ పథకాల కొరకు కృషి చేయాలన్నారు