హుజూర్నగర్ మండలం లక్కవరంలో కుక్కల దాడిలో ఎనిమిది గొర్రెలు మరణించాయి. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన కీత గురులింగం గొర్రెల మందను దొడ్లో తోలి ఇంటికి వెళ్లగా, కుక్కలు దాడి చేసి గొర్రెలను చంపేశాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని ఆయన వేడుకున్నారు. కుక్కలను బంధించాలని స్థానికులు కోరుతున్నారు.