సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శనివారం బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు కొత్త కాపు జగన్ రెడ్డి ఆధ్వర్యంలో పీఎం నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. జీఎస్టీ తగ్గింపుతో పేద ప్రజలకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.