Download Now Banner

This browser does not support the video element.

తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలంటూ మక్కువ మండల కేంద్రంలో నిరసన తెలిపిన వీఆర్ఏలు

Parvathipuram, Parvathipuram Manyam | Aug 23, 2025
తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలంటూ వీఆర్ఏ లు నిరసన తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని మక్కువ మండల కేంద్రంలో ఉన్న తహసిల్దార్ కార్యాలయం ఎదుట శనివారం మధ్యాహ్నం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణారావు మాట్లాడుతూ పేస్కేల్ అమలు చేయాలని, అర్హులైన వారిని VROలుగా ప్రమోషన్ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు పవన్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us