వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర దేవాలయ అభివృద్ధి పనులను అన్యమతస్తులతో చేయిస్తున్న కాంట్రాక్టర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పట్టణ శాఖ దేవస్థానం ఈఓ రమాదేవికి శనివారం వినతిపత్రం సమర్పించింది. బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్,VHP నేత గడప కిషోర్ రావు,బిజెపి నేత ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ..చెప్పులు ధరించి గుడి లోపల అన్య మతస్తులు పనులు చేయడం దారుణమన్నారు. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. హిందూ భక్తుల మనోభావాలు కాపాడాలని కోరారు.