నిజామాబాద్ మండలం కాలూరు జడ్పిహెచ్ఎస్ స్కూలు స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కాలూరు హైస్కూల్ ముందు విద్యార్థులతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్ మాట్లాడుతూ కాలూరు హైస్కూల్ స్థలం మూడు ఎకరాల 18 గుంటలు ఉన్నదన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాటి అధికార పార్టీ నేతలు సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన స్కూలు స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారన్నారు. ప్రస్తుతం గ్రామానికి చెందిన మరో వ్యక్తి కబ్జా చేయాలని చూస్తున్నారన్నారు.