యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండల కేంద్రంలో మల్లాపురం గ్రామానికి చెందిన రజకులు శనివారం సాయంత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మల్లాపురం గ్రామానికి చెందిన గడసంతల వెంకటేష్ అనే వ్యక్తి కొంతమందితో కలిసి రజకులకు చెందిన 376 సర్వే నెంబర్ లోని 42 ఎకరాల భూమిని కాజేసేందుకు సంతకాలను ఫోర్జరీ చేసినట్లు తెలిపారు. ఈ భూమిపై ఒకరిపై ఒకరు కేసులు వేసుకో గా బాధితులు సంతకాలు మేము పెట్టలేదని ఫోర్జరీ చేశారని ఆరోపించారు. ఫోర్జరీకి యత్నించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.