పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎమ్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం నిరసన చేపట్టారు. కోదాడ బస్టాండ్ నుంచి రంగా థియేటర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎమ్ఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.