ములకలపల్లి మండలంలోని మూకమామిడి ప్రాజెక్టు మరమ్మత్తులకు నిధులు కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పోతినేని సుదర్శన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. బుధవారం ములకలపల్లి మండలంలో ని ముఖమామిడి ప్రాజెక్ట్ తో పాటు పలు గ్రామాలను పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యర్రప్పగుంపు గ్రామ చివరి నుంచి మూకమామిడి గ్రామానికి బీటి రోడ్డు వెంటనే నిర్మించాని,మూక మామిడి ప్రాజెక్టు ను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతనని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఇచ్చిన హామీ ని వెంటనే నిలబెట్టుకోవాలి అన్నారు.