పలమనేరు: పట్టణం మున్సిపల్ కార్యాలయం నందు మంగళవారం మధ్యాహ్నం పీస్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం నిర్వహించారు అధికారులు. ఈ సందర్భంగా, డి.ఎస్.పి డేగల ప్రభాకర్, ఆర్డీవో భవాని, సీఐ నరసింహారాజు, ఎమ్మార్వో ఇన్బనాధన్, మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, ఎస్సై స్వర్ణ తేజ, మాట్లాడారు. వినాయక చవితి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అందువలన నిర్వాహకులు ఖచ్చితమైన ఏర్పాట్లు చేసుకుని వినాయకుని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. గత వినాయక చవితి సందర్భంగా కొంతమంది కావాలని గొడవలు సృష్టించి ఇబ్బందులకు గురి చేశారు వారి పైన బైండ్ ఓవర్ చేయడం కూడా జరిగిందన్నారు.