అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని రాచానాపల్లిలో గ్రామ సమీపంలో ఎం వై ఆర్ కళ్యాణమండపంలో మంగళవారం 12:30 నుంచి 4:30 గంటల వరకు అనంతపురం పార్లమెంట్ టిడిపి విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ అనంతపురం పార్లమెంటు పరిధిలో టిడిపి కమిటీలు ఏర్పాటు చేసేందుకు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి చర్చించి కార్యకర్తలు సమస్యలను కూడా అడిగి తెలుసుకుని పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు సరైన గుర్తింపు పార్టీలో ఇచ్చేందుకు ఈ సమావేశంలో టిడిపి నేతలతో చర్చించడం జరిగిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.