పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మట్టి వినాయకులనే వాడాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో అన్నారు. వినాయక చవితి సందర్భంగా మంగళవారం బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో మట్టి వినాయకుల విగ్రహాలను సబ్ కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రస్తుతం కాలుష్యం కారణంగా కొనసాగుతున్న విపత్తులను గుర్తించి మట్టి వినాయకులను వినియోగించాలన్నారు. బోధన్ డివిజన్ తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రతిమలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.