ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం వెలుగు వారి పాలెం ప్రభుత్వ పాఠశాలకు వచ్చే సరుకులు అర్ధరాత్రి సరపరా చేస్తున్నందున నాణ్యత పరిశీలించే అవకాశం లేకుండా పోయిందని ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి వాపోయారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం సరఫరా చేసే బియ్యం రాగి పిండి బెల్లం లాంటి సరుకులు అర్ధరాత్రి పూట సరఫరా చేయకుండా పగటిపూట సరఫరా చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.