కామారెడ్డి : రాబోయే గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మరియు పోలీస్ అధికారులు, వివిధ శాఖల అధికారులతో కలిసి సోమవారం కామారెడ్డి పట్టణం నుండి వినాయక నిమజ్జనానికి సంబంధించిన రూట్లలో తిరిగి నిమజ్జనం జరిగే టెక్రియాల్ల్ చెరువు వరకు వెళ్లి పరిశీలించి చేయవలసిన ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు జిల్లాలో వైభవంగా జరుగుతాయని, ఈ ఉత్సవాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎంతో సంతోషంగా పాల్గొంటారని అన్నారు. పండుగ వాతావరణంలో జరగకుండా చూడాలన్నారు.