యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని, గురువారం సాయంత్రం సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారికి ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇండ్లతో పాటు గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టిందని తెలిపారు.