కొత్తగూడెం,భద్రాద్రి,యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్స్ (కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్) కార్మికుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఖమ్మం డీసీఓ గంగాధర్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 3,003 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో కేటీపీఎస్ నుంచి 2,106 మంది, బీటీపీఎస్ నుంచి 501 మంది, వైటీపీఎస్ నుంచి 396 మంది కార్మికులు ఉన్నారు.నామినేషన్ల స్వీకరణ శనివారం నుంచి ప్రారంభించారు.