కిడ్నాప్ కు గురైన నాలుగు సంవత్సరాల బాలుడిని శనివారం సురక్షితంగా తల్లి చెంతకు చేర్చినట్లు రేపల్లె డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ రేపల్లె పట్టణంలో నివాసముండి భర్త నుండి వేరుగా ఉంటున్న శ్రీలక్ష్మిని పలుమార్లు వేధింపులకు గురిచేశారని, దీంతో ఆమె గట్టిగా ముద్దాయి చరణ్ నిలదీయడంతో అది మనసులో పెట్టుకొని కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్కూల్ నుండి వస్తున్న ఆమె కుమారుడిని బలవంతంగా ఆటోలో నుండి కిడ్నాప్ చేసి విజయవాడ తీసుకెళ్లాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.