మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై వ్యక్తిగత దూషణలకు పాల్పడిన రోహిత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డీఎస్పీకి శుక్రవారం ఫిర్యాదు చేశారు. ‘RTQ' అనే వాట్సాప్ గ్రూపులో సినిమా నటుల ఫొటోలకు బదులుగా శ్రీనివాస్ గౌడ్ ఫొటోను మార్ఫింగ్ చేసి, 'భాష' అని నామకరణం చేసి రోహిత్ రెడ్డి ప్రచారం చేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.