సెప్టెంబర్ 21న సూర్యగ్రహణం ఉందన్న ప్రచారంపై మహానంది వేద పండితుడు బ్రహ్మశ్రీ రవిశంకర్ అవధాని స్పందించారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన వచ్చే సూర్యగ్రహణం భారతదేశంలో ఎటువంటి ప్రభావం ఉండకూడదని ఇది ప్రజలందరూ గమనించాలని అవధానం రవిశంకర్ తెలియజేశారు. సెప్టెంబర్ 7న వచ్చే చంద్రగ్రహణమే మనకు వర్తించనుందని స్పష్టం చేశారు. ప్రజలు అపోహలకు లోనుకాకూడదని పేర్కొన్నారు.