అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని పలు కాలనీలో పిచ్చికుక్క స్వైర విహారం చేసి పదిమంది పైగా గాయపరిచిన ఘటన గురువారం చోటుచేసుకుంది. గ్రామం నుండి వినాయక నగర్, అంబేద్కర్ నగర్, కమ్మర వీధి తదితర కాలనీలలో పిచ్చికుక్క స్వైర విహారం చేసి దాడి వృద్ధులను పాఠశాలలకు వెళ్లే చిన్నారులపై దయచేసి పది మంది పైగా గాయపరిచింది. బెలుగుప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిచ్చికుక్క దాడిలో గాయపడిన అంజినమ్మ విద్యార్థిని ఐశ్వర్య జయరాములు కుల్లాయప్ప సుశీలమ్మ తదితరులకు చికిత్సలు అందించామని వైద్యాధికారి కార్తీక్ రెడ్డి సాయంత్రం 6 గంటలకు పేర్కొన్నారు.