కామారెడ్డి : అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టర్ కి వినతి పత్రం అందించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో భాగంగా వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని, రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయాలని సూచించారు. ఆత్మీయ భరోసా పథకం కింద వెంటనే రూ.12,000 ఇవ్వాలన్నారు.