ఐ.పోలవరం మండలం, తిల్లకుప్ప లో మాజీ సర్పంచ్ రేవు సత్యనారాయణ ఆయన అనుచరులతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనీ వీడి జనసేన పార్టీలో చేరారు. తిల్లకుప్ప జనసేన పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ భాగ్యశ్రీ ఆధ్వర్యంలో ఆయన జనసేన పార్టీలో చేరారు. అనంతరం పవన్ అభిమానులు వాటర్ ప్యూరిఫై ని స్థానిక ప్రభుత్వ పాఠశాలకు బహుకరించారు.