గుంటూరులో భారీ వర్షంతో డొంక రోడ్డులో కరెంటు స్తంభం మంటలు వ్యాపించాయి. దీంతో ప్రజలు పరుగులు తీశారు. శనివారం గుంటూరులో కురిసిన భారీ వర్షంతో డొంక రోడ్డులో కరెంటు స్తంభం వైర్లు తెగిపడి మంటలు చెలరేగాయి. స్థానికులు భయాందోళనకు గురవగా, వెంటనే విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అనంతరం ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.