బాపట్ల జిల్లా కేంద్రం తరలింపుపై వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను మానుకోవాలని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ బాపట్ల నుంచి జిల్లా కేంద్రం తరలి వెళ్తే తాను పదవిలో కొనసాగనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయమై కేంద్రానికి గెజిట్ నోటిఫికేషన్ పంపిస్తున్నారని తెలిపారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మరని తెలిపారు.