సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భాగంగా తిర్యాణి బ్లాక్ లో అధికారులు పురోగతి సాధించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం ASF జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్య, వైద్య ఆరోగ్య, మహిళ శిశు సంక్షేమ, ఇంజనీరింగ్, గిరిజన సంక్షేమ, వ్యవసాయ, మిషన్ భగీరథ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో నెలవారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తిర్యాణి బ్లాక్ లో వివిధ శాఖలకు సంబంధించిన పురోగతిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.