కాకినాడ జిల్లా తుని పట్టణంలో కురిసిన కుండపోత భారీ వర్షానికి తాండవ నదికి భారీగా నీరు చేరుకుంది.శనివారం తుని పట్టణంలో భారీ వర్షం కురిసింది.దీంతో పల్లపు ప్రాంతాలు జలమయంగా మారాయి.తుని పట్టణంతో పాటు ఎగువన కురిసిన వర్షాల నేపథ్యంలో తాండవ జలాశయంతో పాటు పరివాహక ప్రాంతానికి నీరు అధికంగా చేరుకున్న పరిస్థితి దాపురించింది