సంగారెడ్డి పట్టణం గణేశ్ నగర్లోని మురళీకృష్ణ ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయకునికి శుక్రవారం 108 హారతులు ఇచ్చారు. మహిళలు హారతులు పట్టుకొని వినాయకునికి సమర్పించారు. అంతకుముందు వినాయకునికి అర్చకులు వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. విగ్నేశ్వర స్వామి ఆశీస్సులతో భక్తులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.