కనిగిరి పట్టణంలో 30 పోలీస్ యా క్ట్ అమలులో ఉందని కనిగిరి సీఐ ఖాజావలి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు 9వ తేదీన ఆర్డీవో కార్యాలయం వద్ద వైసీపీ నిర్వహించే ఆందోళనకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదన్నారు. నిబంధనలు అతిక్రమించి వైసిపి నాయకులు ర్యాలీలు, ఫ్లకార్డుల ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తప్పు అని సిఐ హెచ్చరించారు. అదేవిధంగా ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చేందుకు 15 మందికి మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. 15 మందిలో కూడా రౌడీ షీటర్లు , స్టేషన్లో కేసులు నమోదైన వారు ఉండకూడదన్నారు.