శ్రీశైలం దేవస్థానం పరిధిలోకి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు పట్టుకున్నారు. శ్రీశైలంలో టోల్గేట్ వద్ద వాహనాల తనిఖీ చేపడుతున్నగా,ఓ వ్యక్తి నుండి అక్రమంగా 30 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైలం దేవస్థానం లోకి తీసుకుని వెళ్తుండగా అతనిని పట్టుకుని శ్రీశైలం దేవస్థానం పరిధిలో ఉన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులకు అప్పచెప్పారు .పట్టుకున్న 30 మద్యం బాటిల్ల మందును కింద పారబోశారు దేవస్థానం పరిధిలోకి అక్రమంగా మద్యం ,మాంసం వస్తున్నాయన్న ఆరోపణలతో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తనిఖీలు చేపట్టారు.