యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆదివారం ఉదయం స్వస్త్ నారి, సశక్త్ పరివార్ కార్యక్రమంలో భాగంగా యోగ పై ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ గోవిందరావు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యోగాతో మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రస్తుత దయనందిన జీవితంలో యోగాను అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్ సూపర్డెంట్ అభిషేక్ అరోరా, అధికారులు వందన, వసంత, అనుష, నీరజ తదితరులు పాల్గొన్నారు.