రాజన్న సిరిసిల్ల జిల్లా భీముని ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన ప్రముఖ రచయిత డా.పెద్దింటి అశోక్ కుమార్ కు మరో అరుదైన గౌరవం దక్కింది.ఆయన రచించిన ‘లాంగ్ మార్చ్’ నవలను మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న కళాశాలల్లో ఎంఏ తెలుగు సెకండ్ ఇయర్ సిలబస్‌లోకి చేర్చారు.ఆయన రచించిన మరో ప్రఖ్యాత నవల ‘జిగిరి’ను నల్గొండ జిల్లా నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ అకాడమిక్ సిలబస్‌గా బోధించనున్నారు. చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లె పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు.అనేక అవార్డులు ప్రశంసా పత్రాలు అందుకొని ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు సంతోషంగా ఉందని శుక్రవారం తెలిపారు.