Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 31, 2025
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సూచనలతోనే తనను హతమార్చేందుకు నలుగురు తన మామిడి తోటలోకి వచ్చారని కావలి mla కావ్యా కృష్ణారెడ్డి ఆరోపించారు. 'నేను చేస్తున్న మంచిని చూసి ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే తన ఉనికి కోల్పోతాడనే భయంతో కావలికి చెందిన ఇద్దరు రౌడీ షీటర్లు, రామిరెడ్డి ఆఫీస్ బాయ్, డ్రోన్ కెమెరామెన్ పంపించారు. వీరికి కాపలాగా మరికొంతమంది కారులో ఉన్నారు' అని ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చెప్పారు.