శ్రీ శ్రీ శ్రీ బలుసులమ్మ అమ్మవారి వారి ఆశీస్సులతో తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధి చెందాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వాలు విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం శ్రీ శ్రీ శ్రీ బలుసులమ్మ అమ్మవారి దసరా మహోత్సవ ఆహ్వాన శుభ పత్రికను ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దసరా అన్నదానం నిమిత్తం 9,116 రూపాయలను ఎమ్మెల్యే విరాళం ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం కన్వీనర్ ఈతకోట తాతాజీ మాట్లాడుతూ బలుసులమ్మ ఆలయంలో సంప్రదాయబద్ధంగా జరిగే దసరా ఉత్సవాలలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలన్నారు.